ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఉద్యోగుల్ని రేషనలైజేషన్ చేస్తున్నామని గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు తూర్పు నాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో
ఆంధ్రప్రదేశ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు
మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సచివాలయం ప్రాతిపదికను కాకుండా క్లస్టర్ వారీగా రేషనలైజేషన్ చేసి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని మంత్రిని కోరారు. డిజిటల్ అసిస్టెంట్లకు పిఎస్ గ్రేడ్ 5 తో పాటు ఇతర డిపార్ట్మెంట్లోకి జూనియర్ అసిస్టెంట్ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సమాన హోదా కలిగిన పదోన్నతి కల్పించాలన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ఇన్ సర్వీస్ బి.ఎడ్ లో అవకాశం కల్పించడం వలన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటుగా విద్యా శాఖలో కూడా అవకాశం కల్పించాలని, సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ తో కూడిన పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. రేషనలైజేషన్ ప్రక్రియపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకున్నామని, దీనిపై సీనియర్ అధికారులతో కమిటీ వేసి చర్చించి ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా రేషనలైజేషన్ చేస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జివివి రాఘవరెడ్డి,
ఉపాధ్యక్షుడు బి అఖిల్,
చంద్రబాబు, చాంద్ బాషా,రాజశేఖర్ ,గంగుల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *