బొద్దికూరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వత వర్థిని సోమేశ్వర స్వామి దేవాలయంలో శివ రాత్రి సందర్భంగా చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్‌ను గ్రామ పెద్దలు సన్మానించారు. చిన్నారులకు బహుమతులు అందజేసారు. ఆలయ పూజారులు వెంకట క్రిష్ణా రావు, పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, పద్మావతి, గ్రామ పెద్దలు, శివాలయం అభివృద్ధి కమిటి సభ్యులు పాల్గొన్నారు.




