గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించాలి – ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలి -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు ఇబ్బందులు లేకుండా ప్రజలకు సకాలంలో అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ 6 మండలాల తహసీల్దార్లు, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు, హౌసింగ్ పీడీతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. భూరీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించే అంశంలో రైతులు, కలెక్టర్ తో సంప్రదించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేటాయింపులు జరపాలని సూచించారు. గృహ రుణాలకు అవసరమైన పొజిషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాలు పత్రాలు సకాలంలో అందజేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ యానిమల్ హస్బండ్రీ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అటెండెన్స్ ఆప్షన్ లో అధర్ ఆప్షన్ ని పునరుద్ధరించరాలని మంత్రిని కోరారు, దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *