స్థిరమైన భవిష్యత్ కోసం నేటి నుండే స్త్రీ పురుషు సమానత్వం పాటుపడుదామని, లింగ సమానత్వంతో అన్ని కార్యాలు సఫలమౌతాయని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః| యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః తత్రాఫలాః క్రియాః” అన్నది నానుడి. అనగా ఎక్కడ స్త్రీ మూర్తి గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కోలువై ఉంటారని, ఎక్కడ స్త్రీని చిన్నచూపు చూస్తూ, బానిసలా చేసుకొంటారో అక్కడ సర్వకార్యాలూ ఆటంకపాలౌతాయని మన భారతీయ ఇతిహాసాలు తెలుపుచున్నాయి.. అర్థనారీశ్వర తత్వంతో పురుషుని తో సమానంగా ఇంకా అంత కంటే ఎక్కువగా మహిళను గౌరవించేది హిందూ సనాతన ధర్మం, స్త్రీమూర్తి తల్లిగా, సోదరిగా, భార్యగ, కుమార్తెగ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. సకల చరాచర సృష్టిని మాతృ స్వరూపంగా హిందూ సమాజం కొలుస్తుంది. భూమిని ధరణి మాతగ, నీటిని గంగా మాతగా, వృక్షాలను తులసి మాతగ, పశు వులను గో మాతగా, ఒక్కటేమిటి ప్రతి దృశ్యంలో ప్రతి క్రియలో అమ్మతనాన్ని చూడడం ఒక్క భారతీయులకే చెల్లు. వ్యక్తి వ్యవస్థగ, శిశువు మనిషిగ ఎదగాలంటే తొలి గురువు. అమ్మ తన పాలిచ్చి, లాచించిన అమ్మ తప్పటడుగులను సరిచేస్తూ ఒక బలమైన రూపం వచ్చేదాకా కడుపున పెట్టుకు చూస్తుంది. తొలి గురువైన తల్లి పెంపకం లోని బిడ్డలు అఅలతో పాటుగా అనంతమైన ప్రకృతిలో మనగలిగే మేధా సంపత్తిని పొందుతాడు. బాలరాముడు చందమామకై ఏడుస్తుంటే దర్పణంలో చూపిన తల్లి అరివీర పరాక్రమ చక్రవర్తి, హిందూ సామ్యాజ్యాధినేత చత్రపతి మహరాజ్ కు వారి తల్లి జిజియాబాయి హిందూ గ్రంధాలను చిన్ననాటనుండే తెలిపి, యుద్ధ విద్యలు నేర్పి శివాజీని అద్వితీయ పరాక్రమ వీరునిగ తీర్చిదిద్దిన విధం తెలిసినదే కదా! సత్య యుగం వాటి నుండి ఈ కలియుగం వరకూ స్త్రీ మూర్తి ప్రథమ స్థానంలో నిలిపిన సంసృతి మనది. మహిళలు అబలలు కారు సబలలు అని నిరూపించి, చరిత్రలో అలవాడు సత్యభామ నుండి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ దేవి, కిట్టూరు రాణి చెన్నమ్మ తదితరులు యుద్ధాలలో కరవాలం తిప్పి అసురులను చీల్చిచెందాడిన విషయం తెలిసినదేకదా! త్యాగానికి, అహింసా ధర్మాన్ని లోకంలో నిలిపిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, ఇలా ఎందరో మనకు చరిత్రను తరచి చూస్తే అడుగడుగున కనపడుతారు. ప్రతి రోజూ మహిళలను గౌరవిస్తూ పూజించే భారత దేశంలో ప్రపంచంలో మహిళా దినోత్సవం అంటూ ఒక్కరోజున జరుపుకోవడం ఎందుకు?మహిళలను బానినలుగ, పిల్లలను కనిపించే యంత్రాలుగ, స్త్రీకి గౌరవం అక్కరలేదని భావిచే ఎడారి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ, స్త్రీ ఎప్పటికి పురుషులకు సమానం కాదనే ఆలోచనలు, పెచ్చుమీరినప్పుడు స్త్రీ పురుష అసమానతలను తొలగించి ఇద్దరూ సమానమే అనే భావన, తక్కువ ఎక్కువలకు చోటు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రపంచ మహిళా దినోత్సవమును మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అరుపుకొంటాము. మనం మన చుట్టూ గమనిస్తే స్త్రీలు తమ కుటుంబ పోషణకు తమ భర్తతో కలసి పనులకు వెళ్ళడం చూస్తుంటాము. అయినా స్త్రీ అంటే చిన్నరూపు ఇలాంటి భావనలను తుద ముట్టించుటకు “నేషనల్ ఉమెన్స్ డే” అని పిలవబడే మొట్టమొదటి మహిళా దినోత్సవం ఫిబ్రవరి 28, 1909 న్యూయార్క్ నగరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా కార్యకర్త థెరిసా మల్కీల్ సూచన మేరకు నిర్వహించబడింది. ఐక్యరాజ్యసమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది, దీనిని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించారు. 1977లో, జర్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 8ని మహిళల హక్కులు మరియు ప్రపంచ శాంతి కోసం అధికారిక సెలవుదినంగా ప్రకటించాలని సభ్య దేశాలను ఆహ్వానించింది. ఇది సమితి మరియు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఎటా స్మారకంగా జడువబడుతోంది, ప్రతి సంవత్సరం. స్త్రీల హక్కులలో ఒక నిర్దిష్ట థీమ్ లేదా సమస్యపై కేంద్రీకృతమై ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2025 ఐక్యరాజ్య సమితి థీమ్ ” ఏక్సలరేట్ ఏక్షన్” – (లింగ సమానత్వం కోసం వ్యూహాత్మక చర్యలను వేగవంతం చేయడం.” ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికల సహకారాన్ని హైలైట్ చేయడానికి చూస్తున్నారు. మహిళలందరికీ మరింత స్థిరమైన భవిష్యత్తును, లింగ సమానత్వమును నిర్మించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సహకరిస్తుందని బి. విజయరావు తెలిపారు.
మహిళాభ్యున్నతికై కుటుంబ ఆర్థిక అవసరాలు బలోపేతం చేయడానికి మహిళల కోసం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
