రాయచోటి అర్బన్ ఏఎస్ఐ ని విధుల నుండి తొలగించాలి – ఏకపక్షంగా అరెస్ట్ చేసిన హిందువులను విడుదల చేయాలి – రాయచోటి ఘనటకు నిరసనగా వి.హెచ్.పి నిరసన – కలెక్టర్ ద్వారా సియం కు వినతి పత్రం సమర్పణ – “ఛలో రాయచోటి” కి వెనుకాడం.

రాయచోటి అర్బన్ ఏఎస్ఐ ని విధుల నుంచి తప్పించాలి, రాయచోటిలో హిందువులపై అక్రమ కేసులు బనాయించిన ఏ ఎస్ ఐ పోలీస్ శాఖకు కళంకం, హిందూవుల ఐక్యత వర్ధిల్లాలి, వీరభద్రస్వామి ఊరేగింపు పై దాడి చేసిన అన్యమతస్తులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యములో ప్రకాశంజిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయము ప్రకాశం భవనం ధర్నాస్థలి వద్ద వందలాదిమంది హిందువులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ బాధ్యులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ద్వారా వినతిపత్రం సమర్పించారు. జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ద్వారా హిందూ చైతన్య వేదిక వినతి పత్రం సమర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా వి.హెచ్.పి జిల్లా కార్యదర్శి ఈమని బలరాం మాట్లాడుతూ ఈనెల రాయచోటి లో వీరభద్ర స్వామి వారోత్సవాలు ఘనంగా జరిగాయి ఆ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మేడ తాళాలతో బాజా బజంత్రీలతో ఊరేగింపుగా నగరోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా దారిలో నూతనంగా నిర్మించిన ఒక మసీద్ వద్దనుండి వందల సంఖ్యలో వచ్చిన ముస్లిం యువత బాజా బజంత్రీలు ఆపాలని, సన్నాయి మేళాలు ఆపాలని గొడవకు దిగారని, పోలీసుల రాకతో, వారి సూచన మేరకు మేళతాళాలను ఆపి స్వామి వారి ఊరేగింపు నిర్వహించి అదే దారిలో తిరుగుప్రయాణం అవగా అదే మసీదు నుండి రాళ్లు, చెప్పులు, మంచినీటి బాటిళ్లను విసిరి మరల గొడవకు దిగారని, వచ్చిన ఏఎస్ఐ ఏకపక్షంగా అవతల వారిని సంతుష్టి పరచేల హిందువులపై కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగిందని అంతేగాక ఎఫ్ఐఆర్ కాపీలో తన గొంతు పై కాలువేసి హత్యాయత్నం చేయాలని చూశారన్న అభియోగాన్ని నమోదు చేయడం చూస్తే హిందువులను అడచివేయాలన్నా ధోరణి ప్రస్ఫుటమవుతుందని అంతేకాకుండా వీరభద్ర స్వామి కార్యక్రమంలో జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం వారిని రెచ్చగొట్టారని తెలపడం క్షంతవ్యం కాదని, మాకు అవతారాలు ఎన్ని అయినా భగవంతుడు ఒక్కడేనని ఎక్కడైనా జై శ్రీరామ్ నినాదాలు చేస్తామని, జై శ్రీరామ్ అనడం తప్పు ఎలా అవుతుందని కనుక ఇలాంటి ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటం డిపార్ట్మెంట్ కే కళంకమని వెంటనే తనను విధుల నుండి తప్పించి అరెస్టు చేయబడ్డ హిందువులను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేనిచో రానున్న వారంలోపు రాష్ట్రవ్యాప్తంగా ఛలో రాయచోటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జునరావు, విభాగ్ విశేష సంపర్క ప్రముఖు ఇనమనమెళ్లూరి సీతారామయ్య, త్రిపుర భైరవానంద స్వామి, పసుమర్తి వెంకటేశ్వర్లు, సాధు శ్రీనివాస్ గుప్తా, వేమూరి చక్రధర పెరుమాళ్ళు, పబ్బిశెట్టి హరిబాబు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శివాజీ, సింగోతు ఏడుకోండలు, వెంకటేశ్వర రెడ్డి, విభాగ్ ప్రచారఖ్ చంద్రశేఖర్, మనోజ్ మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గెం శ్రీనివాసరావు, నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి, పివి కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, బి విజయ రావు, తీగల సత్యవతి, తానికొండ సురేష్, ధనిశెట్టి రామునాయుడు, విహెచ్పి జిల్లా ప్రచార ప్రముఖ రాధా రమణ గుప్తా జంధ్యం, హిందూ చైతన్య వేదిక కన్వీనర్ దగ్గుమాటి వెంకారెడ్డి, గొలిమి వెంకటేశ్వర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు పలుకుతూ నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *