రైతులకు నీటి కుంటలు ఎంతో ఉపయోగం – డ్వామా విజిలెన్స్ అధికారి జాన్సీ రాణి

రైతులకు నీటి కుంటలు (ఫామ్ పాండ్స్ ) ఎంతో ఉపయోగకరమైనవని డ్వామా విజిలెన్స్ అధికారి జాన్సి రాణి అన్నారు. మల్కాపురం, దోసకాయల పాడు పంచాయితీ పరిధిలో రైతులు తవ్వుతున్న ఫామ్ ఫాండ్స్ ను ఆదివారం పరిశీలించారు. ఫామ్ పాండ్స్ వలన భూ గర్భ జలాలు పెరగటంతో పాటు రైతులకు విద్యుత్ లేని సమయంలో కూడ నీరు అందుబాటులో ఉండి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతులకు, ఉపాధి కూలీలకు ఉపయోగకరంగా ఉండేలా ఉండాలని జిల్లా విజిలెన్స్ పర్యవేక్షకులు వెంకట స్వామి సూచించారు. కార్యక్రమంలో ఎపీఓ మురళి, ఈసీ గురు బాబు టీఏలు కోటేశ్వర రావు, రమేష్, ఎఫ్ఏ శ్యాంసన్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *