ఉన్నత లక్ష్యాల సాధనకు యువత కృషి చేయాలి – శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు – నృత్యాలతో అలరించిన విద్యార్థులు

భవిష్యత్ భారతం తరగతి గదుల్లోనే యువత రూపంలో రూపుదిద్దుకుంటుందని యువతను ప్రోత్సహిస్తే వారు సమున్నత లక్ష్యాల సాధనకు తప్పక కృషి చేస్తారని విజయ శిఖరాలను అధిరోహిస్తారని
సి ఎస్ ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శనివారం శర్మ కళాశాల సెమినార్ హాలులో ఏర్పాటైన కళాశాల వార్షికోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. యువత నాయకత్వ లక్షణాలను అల వరచుకోవాలని సూచించారు.
సిఎస్ఆర్ శర్మ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, ట్రెజరర్ ఓరుగంటి నరసింహ శాస్త్రి మాట్లాడుతూ ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన సిఎస్ఆర్ శర్మ కళాశాలలో చదివిన ఎంతోమంది తర్వాత కాలంలో పలు రంగాలలో రాణించి తామేమిటో రుజువు చేశారని పేర్కొన్నారు, శర్మ కళాశాల విద్యార్థులు పలు పోటీలలో పాల్గొని బహుమతులను సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.విజేతలను జ్ఞాపికలతో మెడల్స్ తో సత్కరించారు.
విద్యార్థుల అభ్యున్నతికి వారిని ప్రోత్సహించేందుకు శర్మ కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని వివరించారు. సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపాల్ దిగ్విజయ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు మానవీయ విలువలను చక్కటి వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని అలవర్చుకోవాలని సమాజానికి మార్గదర్శకులుగా మారాలని కోరారు. శర్మ కళాశాల తెలుగు లెక్చరర్ మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇంగ్లీష్ లెక్చరర్ గాయత్రి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు కోలాట ప్రదర్శన అందరిని అలరించాయి, శర్మ కళాశాల విద్యార్థులు కళాశాలకు వాటర్ క్యాన్లు, వైట్ బోర్డులను బహూకరించారు, వారిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *