తాళ్లూరు మండలం లో పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

తాళ్లూరు మండలంలో పది పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు. మండలంలో బొద్దికూర పాడు- ఏ, బి కేంద్రాలు, తూర్పుగంగవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, జాహ్నవి హైస్కూల్, తాళ్లూరులో వికే ఉన్నత పాఠశాల, సరస్వతి హైస్కూల్లు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసారు. ఆయా కేంద్రాలలో 825 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నట్లు చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ లు గా వై శివ రామక్రిష్ణ ప్రసాద్, ఎం రమణా రెడ్డి, బండి శ్రీనివాస రావు, ఎం వెంకటేశ్వర్లు, అంజలి, రామారావు, డీఓ లుగా కోటేశ్వరావు, పాపా రావు, సీహెచ్ నాగేశ్వర రావు, ఎం. యలమందా రావు, కె శ్రీనివాస రావు, నాగి రెడ్డి లు వ్యవహరించనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *