తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త…. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణా సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు.

తిరుమల మార్చి 17(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
గత ప్రభుత్వ హాయంలో తెలంగాణా ప్రజా ప్రతినిధులను అప్పటి టీటీడీ పాలకులు అధికారులు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ బోర్డు పరిగణలోకి తీసుకోలేదు.దీనిపైన తెలంగాణ ప్రజాప్రతినిధులు పలువురు బాహాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ అప్పటి పాలకులు, వాటిని పెడచెవిన పెట్టారు. తమ సిఫారసు లేఖలను అనుమతించాలంటూ పలుమార్లు తెలంగాణ ప్రజా ప్రతినిధులు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మరోసారి తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ సిఫారసు లేఖలను టీటీడీ దర్శనానికి అనుమతించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీటీడీ చైర్మన్
బీ ఆర్ నాయుడు ప్రత్యేక చొరవతో తాజాగా మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమ మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేక పై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నారు. అలాగే బుధ గురువారాల్లో రూమ్ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించనున్నారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సిఫార్సు లేక 6 మందికి మించకుండా దర్శనాలను కేటాయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడమన్నారు. దాని స్థానంలో శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలను స్వీకరించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. దీర్ఘంగా చర్చించి అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నానంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను టీటీడీ కోరింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ప్రత్యేక చొరవతో అమలు కానున్న తెలంగాణా ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించే విధానం*

*సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు*

*బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయింపు*

*ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే 6 మందికి మించకుండా దర్శనం కేటాయించనున్న టీటీడీ*

*ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడవు*

*దానికి బదులుగా శనివారం నాడు ఆదివారం దర్శనం కొరకు లేఖలు స్వీకరించనున్న టీటీడీ*

సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయం

ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను కోరుతున్న టీటీడీ

Oplus_16908288

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *