తాళ్లూరు మండలంలో పది పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 818 మంది గాను 808 మంది పరీక్షలకు హాజరైనట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తెలిపారు. మండలంలో బొద్దికూర పాడు- ఏ, బి కేంద్రాలు, తూర్పుగంగవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, జాహ్నవి హైస్కూల్, తాళ్లూరులో వికే ఉన్నత పాఠశాల, సరస్వతి హైస్కూల్లు పరీక్షా కేంద్రాలను ఎంఈఓ జి సుబ్బయ్య పరిశీలించారు.
ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ లు గా వై శివ రామక్రిష్ణ ప్రసాద్, ఎం రమణా రెడ్డి, బండి శ్రీనివాస రావు, ఎం వెంకటేశ్వర్లు, అంజలి, రామారావు, డీఓ లుగా కోటేశ్వరావు, పాపా రావు, సీహెచ్ నాగేశ్వర రావు, ఎం. యలమందా రావు, కె శ్రీనివాస రావు, నాగి రెడ్డి లు వ్యవహరించారు. ఎస్ఐ మల్లికార్జునరావు తన సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా విద్యార్థులు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. తమకు కేటాయించిన రూములను హాల్ టికెట్ నెంబర్లను పరిశీలించుకుని ఆయా రూమ్ ల కు చేరుకున్నారు. తల్లిదండ్రులు మిత్రులు విద్యార్థులకు గుడ్ లక్ చెబుతూ పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు.


