హద్దులలో కాకుండా అక్రమంగా నిర్మాణాలు – పరిశీలించి న్యాయం చెయ్యాలని తహసీల్దార్ కు విన్నపం

తమ వంశస్తులు, కుటుంబసభ్యులు అమ్మన పొలం హద్దులలో కాకుండా హద్దులు మార్చి నిర్మాణాలు చేస్తున్నారని శివరామపురం గ్రామానికి చెందిన అనపర్తి షడ్రక్ తహసీల్దారు సంజీవ రావుకు ఫిర్యాదు చేసారు. తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఆస్తిలో తన అన్న అనపర్తి పభుదాస్ 50 సెంట్లను వాడపల్లి అంజమ్మకు విక్రయించగా ఆమె వెన్నపూస ఆదిలక్ష్మికి విక్రయించగా ఆమె బొగ్గుల సమర సింహా రెడ్డికి విక్రయించినట్లు చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ జరిగిన హద్దులలో కాకుండా తనకు వచ్చిన భూమిలో నిర్మాణాలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు. పూర్తిగా పొలంను హద్దులను పరిశీలించి తగిన న్యాయం చెయ్యాలని ఆయన తహసీల్దార్ సంజీవ రావుకు విన్నవించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *