టిటిడి మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవి. సుబ్బా రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ (85) సోమవారం మృతిచెందారు. ఒం గోలు లాయర్ పేట
లోని సుబ్బారెడ్డి నివాసంలో ఆమె భౌతికకాయాన్ని ఉంచారు. పిచ్చమ్మ భర్త యర్రం చినపోలిరెడ్డి గతంలోనే మృతి చెందారు. వీరికి నలుగురు సంతానం. కుమారులు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి, మాజీ ఏఎంసి ఛైర్మన్ వైవి.భద్రారెడ్డి, వైవి.హనుమారెడ్డి కుమార్తె శచీదేవి . పిచ్చమ్మ భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్.విజయమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కుందురు నాగార్జునరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నా రాంబాబు, వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి, ఒంగోలు నగర నాయకులు దామా శ్రీనివాసులు, వైవి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పలువురు వైసిపి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. మంగళవారం స్వగ్రామం బాపట్ల జిల్లా, మేదరమెట్లలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కుటుంబసభ్యులు తెలియజేశారు. ఈ అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు.





