సకాలం లో వైద్యం అందించడం ద్వారా ఆరోగ్య వంతమైన జీవితం గడిపే అవకాశం వుంటుంది…..ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట మార్చి 19( జే ఎస్ డి ఎం న్యూస్)
సకాలంలో వైద్యం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో బన్సీలాల్ పేట కు చెందిన శరణ్ కుమార్ చికిత్స కోసం మంజూరైన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందుల కారణంతో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని ముఖ్యమంత్రి సహాయ నిధి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బన్సీలల్ పేట లోని C క్లాస్ కు చెందిన శరణ్ కుమార్ కొద్దికాలంగా నరాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆర్ధిక సమస్యల కారణంగా చికిత్స కు సహాయం కోసం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆశ్రయించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు కాగా, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, జనార్దన్, అబిషేక్, రాజు, శ్రీనివాస్ రావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *