రాజ్యసభ సభ్యులు, టిటిడి పాలకమండలి మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వైవి. సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం మేదరమెట్ల వచ్చి పిచ్చమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం పిచ్చమ్మకు వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత వైసిపి నాయకులు, అభిమానులు హెలిప్యాడ్ వద్ద జగన్ మోహన్ రెడ్డి
తో కలిసి సుబ్బారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. నివాళులర్పించిన వారిలో వైఎస్. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి
కుమారుడు ప్రణీత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూల సురేష్, అంబటి రాంబాబు, వైసిపి బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, వరికూటి అశోక్ బాబు, వరికూటి అమతపాణి, వైసిపి అద్దంకి నియోజక వర్గ ఇన్ఛార్జి పాణ్యం హనిమిరెడ్డి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు, జోగి రమేష్, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
