మూసాపేట ఏప్రిల్ 6 (జె ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్ పల్లి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు వా రి నివాసం నుంచి రామాలయం వరకు పాదయాత్ర ద్వారా చేరుకుని తలంబ్రాలు స్వామి వారికి సమర్పించారు. విద్యుత్ దీపాలంకరణలతో రకరకాల పుష్పాలతో రామాలయం దేదీప్యమానంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.దాదాపు 50 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దాదాపు 436 ఏళ్ల చరిత్ర గల ఈ రామాలయాన్ని సొంత నిధులతో మరియు గ్రామస్తులు సహకారంతో 2017లో పునర్నిర్మాణం చేపట్టామని హైదరాబాద్ మహానగరంలోనే అతిపెద్ద రామాలయంగా మరియు అతి పురాతన దేవాలయం కూకట్పల్లి రామాలయం నిలిచిందన్నారు.ఇక్కడ ప్రత్యేకత సీతారామ, భరత శత్రుజ్ఞ సమేతంగా కొలువై ఉన్నారని.కోరిన కోరికలు తీర్చే ఆ రామయ్యను ప్రతినిత్యం వందల మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలియజేశారు దేవాలయాలు బాగుంటే ఊరు బాగుంటుందని.ఊరు బాగుంటే ప్రజలు బాగుంటారని శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ దంపతులు.మాధవరం రోజా దేవి రంగారావు దంపతులు ఆలయ చైర్మన్ తులసిరావు దంపతులు.. ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…





