ఘనంగా డాక్టర్ బూచేపల్లి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ

వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఆయన సతీమణి బూచేపల్లి నందిని, కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. చీమకుర్తి , దర్శి బివిఎస్ ఆర్ నిలయంల లో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి అభిమానులు పంచి పెట్టారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే టి జెఆర్ సుధాకర్ బాబుతో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిథులు, పార్టీ బాధ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పూల జల్లులు కురిపించారు. పూల మాలలు, బోకేలు, శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. తనపై ఎనలేని అభిమానం చూపిన కార్యకర్తలకు, నాయకులు డాక్టర్ బూచేపల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆలయాలలో పూజలు నిర్వహించి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *