జిమ్ లో ఇద్దరి మధ్య గొడవ -గాయాల పాలైన జిమ్ ట్రైనర్ మృతి -ప్రధాన నిందితుడు అరెస్ట్.. పరారీలో ఇద్దరు.

మేడిపల్లి : ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో జిమ్ ట్రైనర్ యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ కార్పొరే షన్ పరిధిలో సాయికిషోర్ అనే వ్యక్తి జిమ్ ట్రైనర్ గా నిర్వహిస్తున్నాడు. సోమవారం నాడు సా యంత్రం 8 గంటల సమయంలో చంటి అనే పాత స్నేహితుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు జిమ్ వద్దకు వచ్చి జిమ్ లో ఉపయోగించే డంబెల్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. అ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికిషోర్ ను బోడుప్పల్ లేని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ సాయికిశోర్ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి సోదరుడు సోదరుడు కిరణ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన నిందితుడు చంటిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *