ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు వెళ్లిన కోట నీలిమ…………..

సనత్ నగర్ ఏప్రిల్ 8(జే ఎస్ డి ఎం న్యూస్):
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ బయలుదేరి వెళ్లారు.
ఏ.ఐ.సి.సిప్రెసిడెంట్ .మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈనెల 8,9 తేదీలలో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులూ మరియు ముఖ్యనాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ మరియు ఏఐసీసీ సభ్యురాలు డా.కోట నీలిమ కూడా పాల్గొనడానికి అహ్మదాబాద్ బయలుదేరారు. పార్టీ పునరుజ్జీవన వ్యూహం, రాజకీయాలపై చర్చలు, అన్నీరాష్ట్రాలలో పార్టీ పటిష్ఠత మరియు భవిష్యత్ కార్యాచరణే ధ్యేయంగా ఈ సమావేశంనిర్వహించబడుతోందని ఈ సందర్భంగా డా.కోట నీలిమ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *