బేగంపేట ఏప్రిల్ 8(జే ఎస్ డి ఎం న్యూస్) : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 277 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 42, విద్యుత్ శాఖకు సంబంధించి 36, రెవెన్యూ శాఖకు సంబంధించి 45, హోం శాఖకు 14, మున్సిపల్ శాఖకు 14, ఇందిరమ్మ ఇండ్ల కోసం 75 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 51 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్థులు స్వీకరించి ప్రజల సమస్యలు విని ఎండార్స్మెంట్స్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు.
