విఠలాపురం కాలనీలో వైకుంఠ రామాలయ ప్రతిష్టా మహోత్సవం
బుధవారం నుండి ప్రారంభ కానున్నాయి. శిలా నిర్మిత నూతన ఆలయంలో బుధ, గురు, శుక్ర, శని, ఆది వారాలలో పలు ప్రతిష్టాపన ప్రత్యేక పూజా కార్యమ్రాలు నిర్వహించనున్నారు. ఆదివారం సీతారామ స్వామి యంత్ర ప్రతిష్ట, ద్వజ స్తంభ శిఖర ప్రతిష్ట, బొడ్డు రాయి ప్రతిష్టా మహోత్సవములు జరుగునని ఆలయ కమిటీ సభ్యులు, భక్త బృందం తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.

