పశు సంవర్థక శాఖ ఆఫీసర్స్ అసోషియేషన్ (ఎపీఎహెచ్ఎఎస్ ఏ) ఎన్నికలు మంగళవారం డీఎల్ డీఓ సమావేశపు మందిరంలో ఎకగ్రీవంగా జరిగాయి. పలు సమస్యలపై చర్చించిన అనంతరం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎపీఎహెచ్ఐ ఎస్ ఏ నూతన అధ్యక్షుడిగా ఒంగోలు ఎడీ (ఐఎసిపి) డాక్టర్ సిహెచ్ వెంకట రామి రెడ్డి, జనరల్ సెక్రటరీగా టంగుటూరు ఎడీ కె సుధీర్ బాబు, కోశాధికారిగా త్రిపురాంతకం ఎడీ డాక్టర్ ఎన్ శ్రీరాములు, వైస్ ప్రసిడెంట్గా కందుకూరు డిడి డాక్టర్ శ్రీనివాసులు, త్రోవగుంట (ఎవీహెచ్) ఎడీ జాయింట్ సెక్రటరీగా డాక్టర్ బసవ శంకర రావులు ఎన్నికైనారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ టి మోహన్ రావు వ్యవహరించారు. అనంతరం నూతన కమిటీ బాధ్యుడు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి బేబి రాణిని మర్యాద పూర్వకంగా కలిసారు. సంఘ ఎన్నికల గురించి పలు సమస్యల గురించి చర్చించారు.

