ఒంగోలు టౌన్: పొగాకు సాగు చేయు రైతులకు మద్దతు ధర వచ్చేలా తన
వంతు కృషి చేస్తానని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి) బి విశ్వ శ్రీ అన్నారు. ఒంగోలు -2 పొగాకు వేలం కేంద్రాన్ని ఆమె మంగళ వారం సందర్శించారు. వేలం తీరును పరిశీలించారు. ప్రస్తుతం వేలంలో అమ్ముడవుతున్న గ్రేడ్ పొగాకు బేళ్లు మాత్రమే రైతులు తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రైతులకు ఎక్కువగా సాగు ఖర్చులు అయినందుకు రైతులకు మంచి ధర లభించేలా చూడాలని రైతు ప్రతినిధి వడ్డెర ప్రసాద్ కోరారు. ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించి రైతులకు మంచి ధర వచ్చేలా కృషి చేస్తానని ఈడీ హామీ ఇచ్చారు. బోర్డు ఇన్చార్జి సెక్రటరీ దివి వేణుగోపాల్ , ఒంగోలు ప్రాంతీయ అధికారి (ఆర్ఎం) లక్ష్మణ రావు బోర్డు వైస్ చైర్మన్ బ్రహ్మయ్య, మెంబర్ పొదా వర ప్రసాద్, ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి తులసి, రైతు సంఘ ప్రతినిథులు సునీల్, శేషయ్య బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.



