పిజిఆర్ఎస్ వినతులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృఫ్తి చెందేవిధంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు
మంగళవారం సాయంత్రం
కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, ఆర్ఎస్‌డిటిలు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే, నీటిపన్ను, పిజిఆర్ఎస్ గ్రీవెన్స్, 22ఏ పెండింగ్ ధరఖాస్తులు, రెవెన్యూ సదస్సులు, తదితర అంశాలపై మండలాల వారీగా తహశీల్దార్లతో సమీక్షించారు. పిజిఆర్ఎస్ వినతులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృఫ్తి చెందేవిధంగా పరిష్కరించాలని చెప్పారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను తప్పులు దొర్లకుండా, పకడ్బంధీగా నిర్వహించాలని అన్నారు.నీటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

