ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్‌ఎస్ యూ ఐ 55వ స్థాపనా దినోత్సవం .ఘనంగా సంబరాలు….

హైదరాబాద్ ఏప్రిల్ 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఎన్ ఎస్ యు ఐ 55వ స్థాపనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్
నగర ఎన్ ఎస్ యు ఐ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు, ముందుగా ఎం ఎస్ యు ఐ జెండాను ఎగరవేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ, విద్యార్థుల ఐక్యత, ఎన్ ఎస్ యు ఐ సేవల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందని, అనేక విద్యార్థుల త్యాగాల, బలిదానాలు ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వారి చదువులతో పాటు సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజానికి అవసరమైన మార్పును తెచ్చే యువతగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్ ఎస్ యు ఐ అనేది కేవలం విద్యార్థి సంఘమే కాకుండా, యువత భవిష్యత్తును తీర్చిదిద్దే వేదిక. విద్యార్థుల హక్కుల కోసం పోరాడటం, వారిని శక్తివంతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదానం, అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *