తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని,ప్రతి తల్లి బిడ్డ పుట్టిన వెంటనే మర్రుపాలు బిడ్డకు అందించాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ జి. జ్యోతి తెలిపారు. సోమవరప్పాడు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాధాన్యతను, బిడ్డ పుట్టగానే వందరోజుల సంక్షణ పిల్లల వయస్సును బట్టి ఎత్తు, బరువుల్లో వ్యత్యాసాలు గుర్తిం చి వ్యత్యాసం వుంటే శ్యామ్, మ్యామ్ పిల్లలను గుర్తించి వైద్యపరీక్షలు నిర్వహించా లని తెలిపారు. పిలల్లో ఊబకాయాన్ని తగ్గించటానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గురించి అవగాహన కల్గించాలన్నారు. బాలింతలు, గర్భవతులకు పౌష్టి కాహారాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

