గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలే కీలకం: జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్-అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపనకు, దేశ ప్రగతికి తమ వంతు పాత్ర పోషించాలి: జిల్లా ఎస్పీ

ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు తమ గెలుపు ఓటములను సమానంగా చూడాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా భీమ్ సేవా సమితి మరియు భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు, మంగమూరు రోడ్డులో జిల్లా స్ధాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 13 వరకు జరుగుతున్న క్రికెట్ పోటీల కప్ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీలను ఆవిష్కరించారు.ఈ టోర్నమెంట్ లో 40 జట్లు పాల్గొన్నాయి. ముందుగా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆ మహనీయుని చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు జిల్లా ఎస్పీ గారు క్రికెట్ ఆడారు. అత్యుత్తమ క్రీడాస్పూర్తితో, తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ …అంబేద్కర్ గారు గొప్ప మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడనని కొనియాడారు. ఆయన అణగారిన బలహీన వర్గాల అభ్యుదయం కోసం, కుల నిర్మూలన కోసం ఎంతగానో పాటుపడ్డారని, దళితుల, గిరిజనులు, బహుజనులు సామాజిక హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, ఆయన సేవలు నేటి తరాల వారికి ఆదర్శమని, ఆయన స్ఫూర్తిని, త్యాగనిరతిని, నేటి తరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సమ సమాజ స్థాపనకు, దేశ ప్రగతికి తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఆయన జయంతి సందర్బంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు.నేటి యువత క్రికెట్ అంటే అది కేవలం క్రీడ మాత్రమే కాదని గ్రహించాలని, జట్టును స్ఫూర్తిమంతంగా నాయకత్వ లక్షణాలతో నడిపించడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.
అన్నారు.క్రమశిక్షణ, పట్టుదల, పోరాట పటిమ వంటి వాటిని పెంపొందించుకోవడానికి ఇది సహకరిస్తుందన్నారు. శారీరక, మానసిక ధారుఢ్యానికి క్రీడలు కూడా దోహదపడతాయన్నారు. క్రమం తప్పకుండా ఆడే క్రీడలు యువతను క్రమశిక్షణతో ఉండడానికి, జట్టు స్ఫూర్తిని అలవర్చుకోవడానికి సహాయపడతాయన్నారు. ప్రతి జట్టు క్రీడా నియమాలను పాటిస్తూ మంచి ప్రదర్శన కనబరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు తాలూకా ఎస్సై అనిత, దాసరి కోటేశ్వరరావు, యం.ఆదినారాయణ, షిర్డీ సాయి బాబా స్కూల్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *