కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉచితంగా బడులు నిర్మించి ఉచిత విద్యను అందించి జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్తగా ఖ్యాతి గడించారని ఎంఈవో జి.సుబ్బయ్య అన్నారు. స్థానిక ఎన్ఆరీ కార్యాలయం వద్ద జ్యోతిరావుపూలే 198వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుల వ్యతిరేకతకు నిరం తరం పోరాటం సలిపారన్నారు. మహిళలందరూ ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని మహిళాభివృద్ధికి కృషిచేసిన పూలే అందరి హృద యాల్లో స్థిరస్థాయిగా నిలిచాడన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఈవో-2 ఎల్ సుధాకర్ రావు,ఉపాధ్యాయులుబి.కళ్యాణావు, బి.వేణు, జె.నాగరాజు,నరసయ్య, పి వేణుబాబు, ఎం చిరంజీవి, ఖాసీం సాహెబ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయం వద్ద జరుగని జ్యోతిరావుపూలే జయంతి వేడుకలు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల వద్ద ముఖ్యనేతల జయంతి, వర్ధంతి వేడు కలు జరపాలని స్పష్టమైన ఉత్తర్వులుఇచ్చినా స్థానిక ఎంపీడీవో కార్యాలయం సిబ్బం ది గత8నెలలకాలంగా వేడుకలు జరిపిన దాఖాలులేవు. గతంలో పనిచేసిన సిబ్బం ది ముందుగా ప్రజాప్రతినిధులకు సమాచారంఅందించి ఘనంగా నిర్వహించేవారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్యనేతల వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహించాలని ఎంపీపీ తాటికొండ శ్రీను పలుమార్లు చెబుతున్నా స్థానికమండల పరిషత్ అధికారులు పట్టించుకోపోవటంపై ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యనే తల జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జరిపించేలా చూడాల ని పలువురు కోరుతున్నారు.
