హైదరాబాద్ ఏప్రిల్ 15 (జేఎస్ డిఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 274 దరఖాస్తులు అందాయి.
వాటిలోపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 53, విద్యుత్ శాఖకు సంబంధించి 39, రెవెన్యూ శాఖకు సంబంధించి 51, ఇందిరమ్మ ఇండ్ల కోసం 70 దరఖాస్తులు వచ్చాయి. ప్రవాసి ప్రజావాణికి 01, ఇతర శాఖలకు సంబంధించి 166 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని ఎండార్స్మెంట్స్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు.

