తెలుగు ప్రజల గౌరవం కోసం, హక్కుల కోసం, తెలుగు వారి భవిష్యత్తు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికినీ మరచిపోలేము – జిల్లా కలెక్టర్ఏ తమీమ్ అన్సారియా

తెలుగు ప్రజల గౌరవం కోసం, హక్కుల కోసం, తెలుగు వారి భవిష్యత్తు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికినీ మరచిపోలేమని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కనిగిరిలోని ఎంబిఆర్ కళ్యాణ మండలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను కనిగిరి ప్రాంతంలో ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి పిసి పల్లి మండలం, పడమటి పల్లె గ్రామం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పూర్వికులది కావడం జిల్లా ప్రజల అదృష్టంగా భావించవచ్చన్నారు. ఆయన తెలుగు ప్రజల గౌరవం కోసం, హక్కుల కోసం, తెలుగు వారి భవిష్యత్తు కోసం వారు చేసినత్యాగాన్ని మనం ఎప్పటికినీ మరచిపోలేమన్నారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష , ప్రాణ త్యాగం వలన కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలుగు వారికి ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఆయన భాషా కోసమే కాకుండా సామాజిక సమానత్వం కోసం అదేవిధంగా పేదల పక్షాన నిలిచి మహాత్మాగాంధీ గారి స్పూర్తితో అనేక ఉద్యమాలు చేసి అణగారిన వర్గాల ప్రజల కోసమా పనిచేసి గాంధేయవాదిగా నిలిచిపోయారన్నారు. వారి స్పూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్ ను తీసుకువచ్చి అన్నీ రంగాల్లో ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పి4 అనే వినూత్న కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిదేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు సంకల్పంతో పనిచేసినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మనమంతా నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామన్నారు.

కనిగిరి శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, గిద్దలూరు శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, తదితరులు మాట్లాడుతూ….. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన అమరజీవి పొట్టి శ్రీరాములు ఈ ప్రాంత వాసులు కావడం ఎంతో సంతోషకరమన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడై, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ….. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం అమూల్యమైన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరిన్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి జీవిత చరిత్రను తప్పని సరిగా పాత్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఎపి మాలల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డా విజయకుమార్ మాట్లాడుతూ .. చరిత్ర గతిన మార్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల జీవిత చరిత్రలను భవిష్యత్ తరాలకు తెలియచేయాలసిన అవసారం ఉందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్య వైశ్యులకు చెందిన వ్యక్తి కాదని, ఆయన జాతి సంపద అని అన్నారు.
ఎపి ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాకేష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగాన్ని గుర్తుచేసి వారిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా దర్శి, వై పాలెం నియోజక వర్గాల ఇంచార్జీలు డా గొట్టిపాటి లక్ష్మీ, ఎరెక్షన్ బాబు,పలువురు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వారసులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనేక ప్రాంతాలనుండి వచ్చిన ఆర్య వైశ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *