శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ – మార్కాపురం పట్టణం పూర్తీ స్థాయిలో తనిఖీలను స్వయంగా పర్యవేక్షణ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ

జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించేందుకు నేర సమీక్షా సమావేశం అనంతరం మార్కాపురం పట్టణం నందు మొత్తం 28 ప్రదేశాలలో ప్రకాశం జిల్లాకు చెందిన 155 మంది పోలీసు అధికారులు మరియు 600 సిబ్బందితో కలసి, ప్రత్యేక పోలీస్ బలగాలు స్పెషల్ పార్టీ, స్వాట్ టీం, 30 డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతమైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో, రహదారులపై వాహనాలు, పలు ఇళ్లల్లో, శివారు ప్రాంతాల్లో, పాత నేరస్తుల ఇళ్లలలో, చెడు నడతకలిగిన వారు, గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ యాప్స్, కిరాణా షాప్ లలో, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.
ఈ తనిఖీలో ప్రధాన ప్రదేశలలో వాహన తనిఖీలు చేసి సరైన రికార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మోటార్ సైకిళ్లు మరియు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోటార్ సైకిళ్ళు కు సంబంధించి సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేటు సరిగా లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం మరియు వాహనం నడిపే వ్యక్తి కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి వివిధ రకాల వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో రికార్డులు సరిగా లేని పలు మోటార్ సైకిల్ మరియు ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నవాటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు తరలించారు. లాడ్జీలను, డార్మోట్స్ తనిఖీ చేసి,కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులని ప్రశ్నిస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్టమైన నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పోలీస్ అధికారులు చెడునడత గల వారి యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ….జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ తనిఖీల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ తనిఖీల్లో ముఖ్య ఉద్దేశ్యం అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలు ప్రవేశించకుండా నిరోధించటానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడం, నేరస్తులను గుర్తించడం మరియు పట్టుకోవడమని, వాహనాల తనిఖీల ద్వారా సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించడం మరియు తగు చర్యలు తీసుకోవడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పొందించడమన్నారు. అదే విధంగా మార్కాపురం పట్టణం బాగా విస్తరించటం వలన అసాంఘిక కార్యకలాపాలు,మట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి వంటిపై జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్ట్యా సారించి మార్కాపురం పట్టణం మొత్తం జల్లెడ పట్టి ఈ తనిఖీలు నిర్వహించటం జరిగిందని, ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రజల భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించామని, చట్ట వ్యతిరేక పనులకు, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100/112 తెలియజేయాలని అక్కడి ప్రజలను కోరారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, నాగరాజు, రమణ కుమార్, శ్రీనివాసరావు, SB ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర,సీఐలు సుబ్బారావు, బీమా నాయక్, శ్రీకాంత్ బాబు, మల్లికార్జున, రామకోటయ్య, సురేష్, ప్రభాకర్, నాగరాజు, రామారావు, సోమశేఖర్, శ్రీనివాసరావు, అజయ్ కుమార్, హాజరత్తయ్య, ఖాజావలి, సుబ్బారావు, సీఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *