ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తాళ్లూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దివంగత సీఎం ఎన్ టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఇరువురు రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంజూరు అయిన పవర్ స్పేయర్ను పంపిణీ చేసారు. కొర్రపాటి వారి పాలెంలో సీఎం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, శాగం కొండా రెడ్డి, షేక్ పెదకాలేషా వలి (బడే), మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, చందన, రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యాసాగర్, తూము శివ నాగి రెడ్డి, నునుం ఆదినారాయణ, పాలెం అంజి రెడ్డి, రామయ్య, సత్యం, వలి, గొల్లపూడి వేణుబాబు, యాతం శ్రీనివాస రెడ్డి, జాష్టి శ్రీనివాన రావు, నాదేళ్ల శ్రీను, అనపర్తి శ్యామ్సన్, బూచి రాజు, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డాని తదితరులు పాల్గొన్నారు.



