మధిర ఏప్రిల్ 21(జే ఎస్ డి ఎం న్యూస్) :
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఆ కొద్దిమందికే ఉద్యోగాలు దొరికాయనీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.సోమవారం మధిర మండల కేంద్రంలో నిర్వహించిన భారీ జాబ్ మేళాను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారన్నారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పన చేస్తున్నామన్నారు.
ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు బహుళ జాతి సంస్థలకు వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పన చేయబోతున్నామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు 5,000 మందికి యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు.మధిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకేరోజుఉపాధిలభిస్తుందన్నారు.యువత రాష్ట్ర వనరులు, వారు రాష్ట్ర భవిష్యత్తుకు, జీ డి పి పెరుగుదలకు, కుటుంబానికి, సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనీ ఆయన పిలుపు నిచ్చారు.ప్రతి ఆలోచన మంచిది అయితే మంచి ఫలితాలు సాధిస్తారు. యువత మత్తు పదార్థాలు, సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలి, చివరి దశలో తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోవాలనీ యువతకు సూచించారు.
కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్దిమంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మొత్తం ఒక నిర్ణయం తీసుకుంది అన్నారు. ఆ మేరకు రాష్ట్రంలో మూడు అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే 56వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని తెలిపారు. రెండో దశలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ లో భాగంగా వచ్చిన మార్పుల మేరకు బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయం అన్నారు. బహుళ జాతి సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో పర్యటించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు. ప్రస్తుతం సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడము, పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటనలో భాగమన్నారు. మూడవ దశలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 9,000 కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చామని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎంపికైన వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించాం అన్నారు.భారతదేశం పారిశ్రామిక విప్లవాన్ని అందుకోలేకపోయింది, ఐ టి విప్లవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని దూర దృష్టితో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో ఐ టి విప్లవానికి నాంది పలికారని తెలిపారు. వారి ఆలోచనల మేరకే హైదరాబాదులో నాటి కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాదులు వేశారని గుర్తు చేశారు.
5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా మరో నాలెడ్జి సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
చదువు పూర్తి చేసుకున్నవారు ఖాళీగా ఉండకుండా, సొంత ఆదాయంతో ముందడుగు వేసేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయి అన్నారు. ఇక్కడ ఉద్యోగం పొందిన వారు అక్కడే ఆగిపోకుండా ఇది మొదటి మెట్టుగా భావించి వచ్చిన జీతంతో నిరుద్యోగులు జీవితంలో పెట్టుకున్న గొప్ప లక్ష్యాలను సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. మధిరలో జాబ్ మేళా ద్వారా ఓకే రోజు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. యువత ఈ రాష్ట్రానికి గొప్ప వనరు, రాష్ట్ర జిడిపి పెరుగుదలకు, కుటుంబానికి, సమాజానికి వారు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఖాళీగా ఉండే యువత విద్రోహశక్తులు, మత్తు పదార్థాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది, చివరి వయసులో తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోవాలి. యువత సన్మార్గంలో నడిచేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయి అన్నారు.
ప్రతి ఆలోచన మంచిది అయితే ఫలితాలు బాగా ఉంటాయి అన్నారు. టెక్నికల్ స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోయిన వారికోసం రాష్ట్రంలోని 65 ఐటిఐ కళాశాలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు.
నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలని ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఒకేసారి 11, 600 కోట్లు కేటాయించాం అన్నారు. ఈ స్కూల్స్ ద్వారా నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో విద్యారంగానికి ఒకేసారి ఇంత పెద్ద మొత్తం లో ఏనాడు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పిస్తాం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు.




