జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బ్యాసరీన్ లో పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడి, మారణహోమం చాలా దారుణం మని, పర్యాటకుల ఆధార్ కార్డులను వెతకి, కర్మా చదవమని, చదవని వారిని దారుణంగా పాయింట్ రేంజ్ లో తుపాకులతో కాల్చి చంపడం హిందువులపై దాడిగా విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావు తెలిపారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు మగవారిని చంపి ఆడవారితో మోడీతో చెప్పుకోమని తెలపడం వారి వెనుక ఉన్న వారి ప్రోత్సాహం ఉత్సాహం కనబడుతుందని, ఉగ్రవాదాన్ని ప్రపంచం నుండి కూకటివేళ్లతో పెరికివేయాల్సిన సమయం అసన్నమైనదని, ఈ దాడి వెనక అనేక కుట్ర కోణాలు కనబడుతున్నాయని అంతర్జాతీయంగా కాశ్మీర్ సమస్య పోలేదన్న సందేశాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశం ఒకటి రాబోవు అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులను టార్గెట్ చేసుకునే భాగంగా అమర్నాథ్ యాత్ర ప్రధాన మార్గమైన పహేల్గామ్ ను వారు ఎంచుకున్నారని అంతేకాకుండా భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం మరో కారణం 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లో అనేక అభివృద్ధి పనులతో పాటు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని కాలరాచి కాశ్మీరులోయలోని భూములను ఇతరులు కొనకుండా చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఈ మధ్యకాలంలో పాక్ సైనికఅధ్యక్షుడు వారి సైనికులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం, కాశ్మీర్ అనేది ఇస్లాం భూమి అంటూ ఇక్కడకు పర్యాటకులు రాకూడదనే ఉద్దేశంతో ఈ దాడి చేశారని, ఈ దాడిలో 27 మంది మరణించగా పదుల సంఖ్యలో తీవ్ర గాయాలతో మిగిలారని సోమ సుబ్బారావు తెలిపారు.
ఒంగోలు జిల్లా వి.హెచ్.పి కార్యదర్శి ఈమని బలరాం మాట్లాడుతూ హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులతో పాటు దేశంలోని కొన్ని వర్గాలు పహల్గాం, ఉత్తరప్రదేశ్ మరియు బెంగాల్ రాష్ట్రాల్లో హిందువుల పై దాడులు చేస్తున్నారని తెలిపారు. హిందువులా కాదా అని పరీక్షించి మరీ హిందువులను కాల్చి చంపడం, వికృత పాషాణ ఉగ్రవాదుల చర్యల విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని, కేంద్రం ఎట్టిపరిస్థితులలో వారిని వదలిపెట్టదంటూ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ఉగ్రదాడిలో అమరులైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా అంజలి ఘటిస్తూ దేశం యావత్తు ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 25వ తేదీ శుక్రవారం ఉదయం స్థానిక దక్షిణం బజారు చౌరస్తా, వేణుగోపాలస్వామి దేవాలయము వద్ద ఉగ్రముకల దాడిలో అమరమైన వారికి నివాళులర్పిస్తూ ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ విచ్చేసి మరణించిన వారికి సద్గతులు ప్రాప్తించాలని నివాళులర్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహకార్యదర్శి వేమూరి చక్రధర రామానుజ పెరుమాళ్ళు కూడా ప్రసంగించారు.
