మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దోమల పై యుద్ధం మన జీవితాలకు భద్రం – దోమ పుట్ట కూడదు, కుట్టకూడదు.. అంటూ నినాదాలు చేస్తూ ఆరోగ్య సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. దోమల వలన వచ్చు వ్యాధులను, దోమ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. హెచ్ ఈఓ చంద్రశేఖర్, పిహెచ్ఎన్ రమణమ్మ, హెచ్.వి సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

