ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతి అమలుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతి అమలుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, డ్వామా అధికారులతో, ఎంపీడీవోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ……..ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వేసవి కాలం అనుకూలం అయినందున పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉపాధి హామీ పధకాల కింద చేపట్టిన పనుల పురోగతి సాధించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. లేబర్ మొబిలైజేషన్ పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లేబర్ మొబిలైజేషన్ లో త్రిపురాంతకం, ముండ్లమూరు, తాళ్ళూరు, హెచ్ఎంపాడు, గిద్దలూరు మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి వున్నాయని, సంబంధిత ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కూలీలకు రోజువారి సగటు వేతనం 307 తగ్గకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పుల్లలచెరువు, పెద్డారవీడు, దోర్నాల, దొనకొండ, పామూరు, జరుగుమల్లి, పిసిపల్లి, తాళ్ళూరు, వై పాలెం, అర్ధవీడు మండలాల్లో గత వారం కంటే ఈ వారం కూలీలకు రోజువారి సగటు వేతనం తగ్గిందని, ఈ మండలాల్లో సగటు వేతనం తగ్గడానికి గల కారణాలను జిల్లా కలెక్టర్, సంబంధిత ఎంపిడిఓ లను, ఎపిఓ లను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన కారణాలపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉపాధి హామీ పనుల విధుల పట్ల కనీసం అవగాహన లేకపోతే ఎలా పని చేస్తారు, నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు, ఫారం పాండ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయుటకు ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. గ్రామాల్లో వర్షం పడి ఎక్కడైతే నీరు నిలుస్తుందో ఆ ప్రదేశాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), జీవన జ్యోతి యోజన పధకాలను ఉపాధి హామీ కూలీలకు వర్తించేలా క్షేత్ర స్థాయిలో ఎంపిడిఓ లు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో డ్వామా పిడి జోసెఫ్ కుమార్, ఎంపిడిఓ లు, ఏ.పి.డి.లు, ఏ.పి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *