జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పరిశ్రమల శాఖ అధికారులతో, ఎపిఐఐసి అధికారులతో సమావేశమై, జిల్లా లో అమలు జరుగుచున్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ 2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), పిఎం విశ్వకర్మ యోజన, ఆంధ్రప్రదేశ్‌లో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పనితీరు (RAMP) పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-కమ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు (ESDPలు), ఉద్యమ్ వర్క్ షాప్, ఎంఎస్ఎంఈ సర్వే, ఇన్సెంటివ్ రిలీజ్, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థల సేకరణ తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ………. జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎక్కువమందికి ఉపాధి అవకాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అందుకనుగుణంగా యువతకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో జరుగుచున్న పిఎం విశ్వకర్మ యోజన స్టేజ్ 1 వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజక వర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుకు అవసరమైన స్థల సేకరణ, ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాస రావు, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

