పెహల్గావ్ అమరులకు విశ్వహిందూ పరిషత్ పుష్పాంజలి – ఉగ్రవాదులకు, ప్రేరేపితులకు తగిన గుణపాఠం తధ్యం -కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపిన వి.హెచ్.పి.

జమ్మూ కాశ్మీర్ పెహల్గావ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పాశావికదాడిలో అమరులైన హిందూ పర్యాటకులకు ఒంగోలు దక్షిణం బజారు లోని వేణుగోపాలస్వామి దేవస్థానం వద్ద విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున రావు అధ్యక్షతన పుష్పాంజలి ఘటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమానికి ముందుగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు గాంధీ రోడ్డు గుర్రం వారి వీధి తదితర పరిసర ప్రాంత వీధులలో హిందూ బంధువులను జాగృతం చేసే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు నశించాలి – అమరులైన హిందువులకు జోహార్ అంటూ నినాదాలు చేస్తూ కాలినడకన చుట్టివచ్చారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రాంత సత్సంగ్ ప్రముఖు సోమసుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులకు సహకరించే ఏ ఒక్క అన్యమతస్తులకు సహకారం అందించవద్దు, నీచులు, దుర్మార్గులు, నపు*సకులైన ఈ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా మగవారి వస్త్రాలను విప్పి సున్నతి చేసిలేదని, కల్మా పఠించడం రాదని వీరు హిందువే అని నిర్ధారించి నిర్ధాక్షిణ్యంగా క్రూరులై తుపాకీ గుండ్లను పేల్చి చంపడం, క్షంతవ్యం కాదు అంటూ … కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉగ్రవాదులను, వారిని ప్రేరేపించిన వారిని తుదముట్టించాలని, భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే గడగడలాడే విధముగా కూకటి వేళ్లతో పెకిలించాలని విజ్ఞప్తి చేశారు. అమాయక పర్యాటకులు, నూతన వధూవరులలో 27 మందిని మరో 40 మందిని క్షతగాత్రులను చేసిన ఉగ్రవాదులను విడిచి పెట్టేది లేదని సమస్త హిందూ సమాజం ప్రభుత్వానికి అండగా ముందుకు నడుస్తుందని జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున్ రావు తెలిపారు.
పరిషత్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు కార్యక్రమంలో పాల్గొని అమరులైన వారికి పుష్పాంజలి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *