బేగంపేట మే 4 ( జెఎస్ డి ఎం న్యూస్ ) :
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన 2.25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు (ఎల్ ఓ సి) పత్రాన్ని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అమీర్ పేట డివిజన్ లోని బాపూ నగర్ కు చెందిన కల్లీ బాయి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్ధిక సహాయం మంజూరైంది. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో లబ్ధిదారురాలి కుమారుడికి ఎల్ ఓ సి ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్ మణి కుమార్, గోపిలాల్ చౌహాన్, హరిసింగ్, కూతురు నర్సింహ, బలరాం తదితరులు పాల్గొన్నారు.
