మెట్టు గూడ మే 4 (జె ఎస్ డి ఎం న్యూస్) :
మెట్టుగూడ శ్రీ ఉమా మహేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మరియు టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు శ్రీ కాలభైరవ స్వామి ప్రాణ ప్రతిష్ట, శ్రీ ఆంజనేయ స్వామి, మరియు నవగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శతాబ్ది ఉత్సవాలకు హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాలయం అభివృద్ధికి సహకారం అందించేందుకు తమ తరపున పూర్తి మద్దతు ఉంటుందని డిప్యూటీ మేయర్ తెలిపారు.



