సికింద్రాబాద్ మే 5(జే ఎస్ డి ఎం న్యూస్)
రానున్న జీ హెచ్ ఎం సి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ కంటేస్టేడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం ఆదివారం సీతాఫలమండి బి ఎన్ ఆర్ గార్డెన్ లో జరిగింది.
ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పార్టీ అసెంబ్లీ పర్యవేక్షుడు మాజీ ఎమ్మెల్యే లక్షమారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రానున్న జీ హెచ్ ఎం సి ఎన్నికల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడుగా
పని చేయాలని సూచించారు. లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన
6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం
చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు.
అదం సంతోష్ మాట్లాడుతూ నియోజకవర్గములో పార్టీ పటిష్టత కోసం చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగిందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడం, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. బూత్‌స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు టార్గెట్‌లు పెట్టుకొని పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్, సందీప్ రాజ్, షకీల్, జలందర్ రెడ్డి, కిషోర్ యాదవ్, డివిజన్ అద్యక్షులు అనిల్ కుమార్, అభిషేక్, రవి, బ్రహ్మాజీ, గంట రాజు, ప్రభాకర్, సతీష్, జగ్గూ, సురేష్ లాల్, మహేందర్, శంకర్, వహీద్, తదితరులు పాల్గొన్నారు.




