క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న రెవెన్యూ తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి

క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న రెవెన్యూ తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
సోమవారం ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలు, సాగు, త్రాగునీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఒక్క అర్జీనీ స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. కొండపి నియోజక వర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి మండలాల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుచున్నదని, అందులో భాగంగా ఈ నెల 3వ తేదీన మర్రిపూడి మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ ను నిర్వహించగా 250కి పైగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగిందన్నారు. వాటిలో 100 కి పైగా రెవిన్యూ సమస్యలేనని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు పొన్నలూరు లో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, ఇంటి పట్టాలు మంజూరు, అక్రమ రిజిస్ట్రేషన్స్, మిటేషన్ పై అర్జీలుం రావడం జరిగిందని, అలాగే విద్యుత్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్, స్తంభాలు మార్పు పై, అలాగే పంచాయతీ రాజ్ శాఖ కు సంబంధించి సైడు మురుగు కాలువల నిర్మాణాలపై అర్జీలు రావడం జరిగిందని మంత్రి తెలిపారు. వచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆర్జీల పరిష్కారానికి అవసరమైతే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు లబ్దిదారులకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ డి డి లక్ష్మా నాయక్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి, ఎస్సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *