బేగంపేట, మే 6 (జె ఎస్ డి ఎం న్యూస్) : మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మంగళవారం జరుగుతున్న సీఎం ప్రజావాణిని బీహార్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల బృందం సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా బృందం సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. సీఎం ప్రజావాణి గురించి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి , స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లు వారికి వివరించారు. సీఎం ప్రజావాణి పని తీరు పట్ల బీహార్ అధికారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలో ఇదే తరహా పద్ధతులు అమలు చేస్తామని వారు పేర్కొన్నారు.
