రెవెన్యూ సమస్యలపై పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, రెవెన్యూ అధికారులతో సమావేశమై రెవెన్యూ సదస్సు లు, “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) లో వచ్చిన అర్జీల పరిష్కారం మరియు జిల్లా లో వివిధ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన భూ కేటాయింపుల ప్రతిపాదనలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో ఎక్కువగా రెవెన్యూ సమస్యల పైనే అర్జీలు వస్తున్నాయని, వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యను అర్థం చేసుకొని అనాలసిస్ చేసి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లాలో గతం లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులు మరియు పి జి ఆర్ ఎస్ లో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై క్షేత్ర స్థాయి ఆడిట్ ను సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్జీల పరిష్కారం లో భాగంగా క్షేత్ర స్థాయి లో ఎండార్స్మెంట్ వేసిన వాటిని పరిష్కారం చూపిన విధానం సక్రమంగా ఉందా లేదని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్దతో పరిశీలించాలన్నారు. ముఖ్యంగా రీ ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా ఎండార్స్మెంట్ చేశారా లేదా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత అర్జీదారులు సంతృప్తి చెందారా లేదా పరిశీలన చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో నెలకొని వున్న రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా లో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ కేటాయింపులపై వచ్చిన ఆర్జీలను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డిఓ లు లక్ష్మిప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి బరద్వాజ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస రావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *