‘ఉగ్రవాదాన్ని’ ఉపేక్షించబోం :కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డిఅంబర్​ పేట్​ లో తిరంగా ర్యాలీ17న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపు.

హైదరాబాద్​ మే 15 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామన్నారు. గురువారం అంబర్​ పేట్​ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పహల్గామ్​ దాడి, ఆపరేషన్​ సిందూర్​ లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ.మే 17న ట్యాంక్​ బండ్​ వద్ద పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ర్యాలీ ద్వారా భారత సైనికుల మనోస్థైర్యాన్ని పెంచాలని, ప్రతీ ఒక్కరూ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ ర్యాలీలో అన్ని సంఘాలు, కులాలు, మతాలు, ప్రముఖులు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొంటున్నారని చెప్పారు.
ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించే వరకూ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. భారత సైనికులు భవిష్యత్​ లోనూ ఇదే తరహాలో విజయం సాధించి సత్తా చాటాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *