హైదరాబాద్ మే 16(జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
ఎల్బీనగర్ నాసా హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పైన్ మరియు హెడేక్ క్లినిక్ సేవలను ప్రారంభించినట్లు నాసా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ ఖాన్ తెలిపారు. ఈ ప్రత్యేక క్లినిక్ సేవల పోస్టర్ ను డాక్టర్లతో కలిసి ఆవిష్కరించారు. స్పైన్ మరియు హెడేక్( తలనొప్పి) సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులైన నాసా హాస్పిటల్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ళ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ శివాని ప్రగాఢ ల నేతృత్వంలో ప్రతి శుక్రవారం క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్లినిక్ లో 50% డాక్టర్ కన్సల్టేషన్ రాయితీతోపాటు డాక్టర్ సలహా మేరకు ఎం ఆర్ ఐ రూపాయలు 1,999/-, సీటీ స్కాన్ రూపాయలు 999/-ల కె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు సైతం నిపుణులైన వైద్య సేవలను అందించేందుకే ఈ ప్రత్యేక క్లినిక్ ను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ ఖాన్ తెలిపారు. ఈ ప్రత్యేక క్లినిక్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఉచిత రిజిస్ట్రేషన్ కోసం 77710 83108 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.
