బేగంపేట మే 19 (జె ఎస్ డిఎం న్యూస్):
భారత్ మాతాకీ జై ,జై జవాన్, వందేమాతరం అంటూ నినాదాలతో సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుంచి ఎం జీ రోడ్డు మహాత్మా గాంధీ విగ్రహం వరకు బిజెపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి కన్వీనర్ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ సైనికులకు సంఘీభావంగా సోమవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానం సైనిక అమరవీరుల స్థూపం నుంచి ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీని బిజెపి శ్రేణులు భారీగానిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి జిల్లా బిజెపి అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిలు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన విరోచిత పోరాటం అభినందనీయమన్నారు. పహల్గాం ఉగ్రదాడి కి ప్రతీకారంగా భారత జవాన్లు కేవలం 25 నిమిషాల సమయంలోనే పాకిస్తాన్ లోని ఉగ్ర మూకల స్థావరాలపై దాడులు చేసి మట్టుబెట్టాయనీ అన్నారు. పాక్ దుష్ట పన్న గాలను, కుయుక్తులను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కదిలిన బిజెపి శ్రేణులు జాతీయ జెండాలను చేత భూనీ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పరేడ్ మైదానం నుంచి భారీ ర్యాలీని ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్లు చీర సుచిత్ర శ్రీకాంత్, కొంత దీపిక, కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ భానుకా నర్మదా మల్లికార్జున్, బీజేవైఎం సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శివాజీ, అధికార ప్రతినిధులు బి ఎన్ శ్రీనివాస్, నాయకులు శ్రీశైలం గౌడ్, కృష్ణమూర్తి ,హనుమంతు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



