దర్శి లో ఘనంగా టిడిపి మినీ మహానాడు

దర్శి టిడిపి మినీ మహానాడు సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, టిడిపి ఇన్ చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు పాల్గొని ప్రసంగించారు. ముందుగా దేవంగత సీఎం ఎన్. టి ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దర్శిలో జరిగిన మినీ మహానాడు వేదికగా నియోజక వర్గంలోని ఐదు మండల పార్టీ అధ్యక్షులు మరియు దర్శి టౌన్, దొనకొండ టౌన్, కురిచేడుటౌన్ టిడిపి అధ్యక్షులుగా ప్రకాశం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీలు ప్రకటించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నూతన దర్శి నియోజకవర్గ కమిటీ వివరాలు..

దర్శి మండల టిడిపి అధ్యక్షులుగామారెళ్ల వెంకటేశ్వర్లు,తాళ్లూరు అధ్యక్షులుగా మేడగం వెంకటేశ్వర రెడ్డి, ముండ్లమూరు అధ్యక్షులుగా కూరపాటి శ్రీను, కురిచేడు అధ్యక్షులుగా పిడతల నేమిలయ్య, దొనకొండ అధ్యక్షులుగా మోడీ ఆం జనేయులు, దర్శి టౌన్ అధ్యక్షుడిగా పుల్లలచెరువు సత్యనారాయణ, దొనకొండ అధ్యక్షులుగా షేక్ తోహిద్ అంజూమ్, కురిచేడు టౌన్ అధ్యక్షుడిగా మేడం నాగేశ్వరావులను ప్రకటించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *