పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి -ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

అన్నదాతలను ఆదుకునేందుకు రూ.200 కోట్లు ఇవ్వలేరా అంటూ దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం స్థానిక పొగాకు వేలం కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి స్వయంగా పరిశీలించారు. పొగాకు రైతుల గిట్టుబాటు ధర విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వేలం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పొగాకు రైతులతో మాట్లాడారు. ఏడాది పొగాకు పంట నాణ్యత తగ్గిందని లోగ్రేడ్ పొగాకును తీసుకొస్తున్న రైతులను వెనక్కి తిప్పి పంపుతున్నారని రైతులు వివరించారు. వాతావరణ పరిస్థితులతో పొగాకు పెట్టుబడి బాగా పెరిగిందని, నాణ్యత తగ్గిందని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ…. అప్పట్లో జగనన్న ప్రభుత్వం రైతులమీద ప్రేమతో రూ. 100 కోట్ల కేటాయించి మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి కొనుగో లుచేయించారన్నారు. ఈ సంవత్సరం రైతులు ఆందోళన చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులను గాని, కూటమి ప్రభుత్వం గాని ముందుకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైనా రైతులు ఒక్క విషయంలో కూడా న్యాయం జరగలేదన్నారు. రైతులెవరు ఆత్మహత్య చేసుకోవద్దని, 2029లో మన ప్రభుత్వ అధికారంలోకి వస్తుందని అందరికీన్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధాకరమన్నారు. ఆదివారం ముగ్గురు రైతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వం ‘ రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో పొగాకు బోర్డు మాజీ డైరెక్టర్ మా రెడ్డి సుబ్బారెడ్డి, వైసిపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మెట్టు వెంకట రెడ్డి, గొలమారి చెన్నారెడ్డి. జి శ్రీను, గుజ్జుల సంజీవరెడ్డి, కేకేమిట్ల ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, తాళ్లూరు మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, కేకే మెట్ల, కురిచేడు, ముండ్లమూరు జడ్పిటిసిలు అక్కి దాసరి ఏడుకొండలు, సుసుం నాగిరెడ్డి, రత్నం రాజు, దర్శి నియోజకవర్గ రైతు సంఘం నాయకులు బంక నాగిరెడ్డి, కేకేమిట్ల, దొనకొండ, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు మోరా శంకర్ రెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సుబ్బయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం పొదిలి లో దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కుమారుడు శ్రీనివాస రెడ్డి నివాసం లో తేనీటి విందుకు హాజరు అయ్యారు.

పొదిలి ఉడుముల ఆసుపత్రి లో రోడ్ ప్రమాదం లో గాయపడ్డ దొనకొండ మండలం తెల్లబాడు సర్పంచ్ బాలిరెడ్డి ని పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *