కూకట్ పల్లి మే 20(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
బాలానగర్ ఓల్డ్ విలేజ్ లో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయాన్ని కూకట్ పల్లి యం.ఎల్. ఎ మాధవరం కృష్ణారావు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలసి సందర్శించారు, అనంతరం భక్తులు మరియు స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రహారి గోడ మరియు ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలనీ వారు కోరారు.దీంతో స్పందించిన యం.ఎల్.ఎ మాట్లాడుతూ సొంత నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, ఎలిజాల యాదగిరి, దేవాలయము కమిటీ సభ్యులు, ఖాజా, బాబా, మహిళా నాయకులూ కవిత, సుజాతగౌడ్, భారతి, రేణుక, సులోచన తదితరులు పాల్గొన్నారు .



