ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు 68వ వర్ధంతిని పురష్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, అనంతరం దేశాభివృద్ధిలోను టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ దార హనుమంత రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, శాగం కొండా రెడ్డి, పార్టీ ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, హనుమంత రావు, కార్యాలయ ఎవో సానికొమ్ము నత్యం, వ్యవసాయధికారి ప్రసాద రావు, ఆఫీన్ సిబ్బంది పాల్గొన్నారు.
